అప్రాశ్యులు
Von: Bhimeswara Challaఅరవైయేళ్ల నాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం.
రజనిఆత్మనిర్భరశక్తి అసాధారణమైతే ఆమె చంచలస్వభావం అనూహ్యగోచరం.
కమల పాతివ్రత్య సంకల్పం ఆదరణీయమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిసహజం.
విశాల అఖండిత సేవాభావం మానవాతీతమైతే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీతత్వనిదర్శనం.
ఈ ఐ-బాటిల్లో ని రామం రజనీల అనూహ్య అనుబంధం, ప్రసాద్ కమలల విచిత్ర సంబంధం, సనల్ విశాలల పవిత్రబంధం నేటి పాఠకులకు వింటేజ్ వైన్.
త్రీ ఛీర్స్!
Stichwörter:
Telugu novel, Telugu ficftion, Telugu literature, Telugu romance
Beiträge und Kommentare